Skip to main content

Posts

Showing posts from November, 2024
 ఈ రొజు నీదే! Chapter 1 - Part 1 తన సమస్యలను కప్పి పుచ్చుకోవడమ్ లొ మోహన్ వేమూరి ఎవరికీ తీసిపోడు. మోహన్ తన గురించి తాను అలా అనుకోవడం లో తప్పు లేదు. సమర్థించుకోవడానికి కొన్ని అదనపు హంగులూ ఉన్నాయి. మోహన్ పూర్వాశ్రమం లో నటుడు – సరే , చిన్నపాత్రలే కావొచ్చు – కానీ , నటన అంటే ఏమిటో తనకి తెలుసు. అంతే కాదు. ఇప్పుడు మోహన్ నోట్లో ఖరీదైన , పొడవాటి , సన్నటి , సిగరెట్ వెలుగుతూ ఉంది. తలని ఒక క్యాప్ అలంకరించి ఉంది. ఒక మనిషి నెత్తిన క్యాప్ పెట్టుకుని , నల్ల కూలింగ్ కళ్ళద్దాల తో , సిగరెట్ తాగుతూ ఉంటే , అతని కి ఒక సౌలభ్యం ఉంటుంది. మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం కష్టం. ప్రతి రోజు మాదిరే , పొద్దున్నే ,  పన్నెండో అంతస్తు నుంచి లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్ లో లాబీ కి మీట నొక్కాడు మోహన్. తనకి ముందు రోజు పొస్టులో ఏవైనా వచ్చాయేమో (ఏమీ రావు) , చూసుకుని , బ్రేక్ ఫాస్ట్ కి డైనింగ్ హాల్ కి వెల్దామని ప్లాను. తను చూడడానికి మంచి సంపాదనాపరుడి లానే కనబడుతున్నాడని అతని నమ్మకం ; కాదు ఆశ . ఒక రకంగా చెప్పాలంటే , కేవలం ఆశ మాత్రమే. ఎందుకంటే , ఇప్పుడు ఉన్న గెటప్ ని ఇంకొంచెం మెరుగు పరిచే శక్తి కూడా అతనికి లేదు. లిఫ్టు లో వస్త