Image Credit: Gemini AI Read Part - 1 Read Part - 2 మార్కెట్ల పరిస్థితి అంత బాలేదు , అన్నాడు మస్తాన్. అది సరదాగా అన్నట్లు అనిపించినా , మస్తాన్ మోహంలో ఏ కదలికా లేకపోవడం వల్లనో , గొంతు లో ఏ భావమూ పలుకక పోవడం వల్లనో , కళ్ళు క్రిందికి చూడడం వల్లనో , లేక మోహన్ కి మస్తాన్ మీద ఉన్న అభిప్రాయం వల్లనో , మొత్తానికి , సరదా స్టేట్మెంట్ మాదిరి లేదు. మస్తాన్ కి మార్కెట్ మీద పెద్ద ఆసక్తి లేదు. బహుశా , తన పరిస్థితి మస్తాన్ కి తెలుసేమో ? మస్తాన్ లాంటి వాళ్లకి ఇతరుల విషయాలు , ముఖ్యంగా కష్టాలు , అలా తెలుస్తూ ఉంటాయి. అవును , మార్కెట్ అస్సలు బాలేదు. ఇంకా చెప్పాలంటే , తాను పెట్టుబడి పెట్టిన సరుకుల (కమోడిటీస్) విపణి పరిస్థితి అస్సలు బాగాలేదు. తను , డాక్టర్ జే తో కలిసి తృణ ధాన్యాల పైన - నాల్గు రోజుల క్రితం క్వింటాలు 2800 రూపాయలు చొప్పున 5 టన్నుల ; అంటే యాభై క్వింటాళ్ల ఆర్దరు పెట్టాడు. అదేం మాయో , పెట్టిన గంట వరకూ కొద్ది గా పెరిగింది. తర్వాత పడిపోవడం మొదలైంది. నిన్న సాయంత్రానికి 2400 రూ....
ఈ రోజు నీదే ! - Part 2 Link to Part 1 “ఈ రోజు చూడ్డానికి చురుగ్గా కనిపిస్తున్నావు ,” అన్నాడు మస్తాన్. “నిజమా ? నీ కళ్ళకి అలా అనిపిస్తూందా ,” అంటూ ఒకసారి ఆ పాన్ షాపు అద్దాలలొ తనని తాను చూసుకున్నాడు మోహన్. లోపల అతికించిన గొప్ప వాళ్ళ ఫోటోలు , వాటి క్రింద పేర్చిన సిగరెట్ పెట్టెల దొంతరలు – శ్రీ శ్రీ , చేగువేరా , కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ , రాజశేఖర్ రెడ్డి, గాంధీ , బోసు , శ్రీదేవి , కపిల్ దేవ్ , ఒక పాత తరం నటీమణి - కన్నాంబో , కాంచనమాలో - మస్తాన్ అభిరుచి కలగాపులగం లోంచి తన మొహం…విచిత్రంగా చూస్తూ కొంచెం తిక్క నవ్వుతో…ఇంప్రెసివ్ గా అయితే లేదు. మరి మస్తాన్ చురుగ్గా ఉన్నావని ఎందుకన్నాడో…ఆటపట్టించే రకం కాదు తను. మసక బారిన అద్దాల్లో మరొక్క సారి చూసుకున్నాడు. వెడల్పాటి నుదురు పై , బ్రాకెట్ల లాంటి ముడుత భృకుటి మధ్యలో. ..ఖేచరీ సాధన చేశాను అని చెప్పుకున్నా నమ్మేస్తారేమో ! రెండు చెంపల పై కొంచెం మసి బారుతున్న పసిమి. అద్దం లోంచి తన వైపే చూస్తున్న ఆ ఆందోళన , ఆశావహం కలిసి...